Breaking News

Month: February 2021

సంఘ విద్రోహశక్తులకు సహకరించొద్దు

సంఘ విద్రోహశక్తులకు సహకరించొద్దు

సారథి న్యూస్, తాడ్వాయి: సంఘవిద్రోహ శక్తులు, వివిధ నిషేధిత విప్లవ పార్టీ గ్రూపులకు సహకరించవద్దని తాడ్వాయి ఎస్సై వెంకటేశ్వరరావు సూచించారు. మంగళవారం ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని లింగాల గ్రామ పంచాయతీ పరిధిలోని రాపట్ల గుత్తికోయగూడెంలో పోలీసు బలగాలతో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతిఇంటిని క్షుణ్ణంగా తనిఖీచేశారు. కొత్త వ్యక్తులు ఎవరైనా వచ్చారా? లేదా? అనే కోణంలో సోదాలు జరిపారు. అనంతరం గొత్తికోయ ఆదివాసీలందరిని ఒకచోట సమావేశపరిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అసాంఘిక […]

Read More
మెట్రోలో గుండె పదిలంగా.. ‘అపోలో’కు

మెట్రోలో గుండె పదిలంగా..

సారథి న్యూస్, హైదరాబాద్: ఓ వ్యక్తి చనిపోయి మరొకరికి ప్రాణం పోశాడు. బ్రెయిన్​ డెడ్​ అయిన సదరు వ్యక్తి గుండెను మరొకరికి అమర్చేందుకు మెట్రో రైలు ద్వారా నిమిషాల్లో తీసుకెళ్లారు డాక్టర్లు. వివరాల్లోకెళ్తే.. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్​కు చెందిన వరకంతం నరసింహారెడ్డి(45) ఆదివారం అధిక రక్తపోటుతో ఎల్బీ నగర్ లోని ​కామినేని ఆస్పత్రిలో చేరాడు. బ్రెయిన్ డెడ్ అయినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. అవయవదానానికి కుటుంబసభ్యులు అంగీకరించడంతో మరొకరికి ఆ గుండెను అమర్చేందుకు జూబ్లీహిల్స్ అపోలో ప్రముఖ […]

Read More
5వ తేదీలోపు జీతాలు ఇవ్వాలే

5వ తేదీలోపు జీతాలు ఇవ్వాలే

సారథి న్యూస్, బిజినేపల్లి: తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ గ్రామపంచాయతీ ఎంప్లాయీస్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక ఎంపీడీవో ఆఫీసు ఎదుట ధర్నానిర్వహించిన అనంతరం ఎంపీవోకు వినతిపత్రం అందజేశారు. తమకు కనీస వేతనం రూ.21వేలు ఇవ్వాలని, జీవో నం.51ను సవరించి, మల్టీపర్పస్ విధానాన్ని రద్దుచేయాలని డిమాండ్ ​చేశారు. ప్రతినెలా 5వ తేదీలోగా జీతం వచ్చేలా చూడాలని డిమాండ్​ చేశారు. కారోబార్, బిల్ కలెక్టర్లకు ప్రత్యేకహోదా కల్పించాలని కోరారు. మెమో నంబర్​2021ను వెనక్కి […]

Read More
ప్రతి డ్యాం వద్ద బోటింగ్​సౌకర్యం

ప్రతి డ్యాం వద్ద బోటింగ్​ సౌకర్యం

సారథి న్యూస్, హైదరాబాద్: హుస్సేన్​సాగర్​లో తెలంగాణ టూరిజం శాఖ ఏర్పాటుచేసిన క్రూయిజ్​ బోట్​ను టూరిజం శాఖ మంత్రి వి.శ్రీనివాస్​గౌడ్, డిప్యూటీ సీఎం మహమూద్​అలీ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్​గౌడ్​ మాట్లాడుతూ.. త్వరలోనే హుస్సేన్​సాగర్​లో కదిలే రెస్టారెంట్​ బోట్ ​అందుబాటులోకి వస్తుందన్నారు. అలాగే దుర్గంచెరువులోనూ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పర్యాటకుల సౌకర్యార్థం రాష్ట్రంలోని ప్రతి డ్యాం వద్ద బోటింగ్​ సౌకర్యం కల్పిస్తామన్నారు. గోవా నిపుణుల సహాయంతో రాష్ట్రంలో వాటర్ స్పోర్ట్స్ అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించారు. ప్రతి […]

Read More
రక్షణ శాఖకు బడ్జెట్​లో పెద్దపీట

రక్షణ శాఖకు బడ్జెట్​లో పెద్దపీట

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం బడ్జెట్​లో రక్షణ శాఖకు పెద్దపీట వేసింది. సంబంధిత శాఖను బలోపేతం చేసేందుకు భారీగా కేటాయింపులు చేసింది. సరిహద్దుల్లో భద్రత కట్టుదిట్టం చేయడం, సైన్యానికి అధునాతన ఆయుధాలు కల్పించడంతో వారికి సౌకర్యాలు మెరుగుపరిచేందుకు ఈ నిధులు వెచ్చించనున్నారు. 2021–22 ఆర్థిక సంవత్సరంలో రక్షణ రంగానికి రూ.4,78,195.62 కోట్లు కేటాయించినట్లు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్​ వెల్లడించారు. సోమవారం బడ్జెట్​ ప్రవేశపెట్టిన సందర్భంగా ఆమె మాట్లాడారు. 15 ఏళ్లలో లేని విధంగా కేటాయింపులు చేసినట్లు తెలిపారు. […]

Read More
రోడ్డు ప్రమాదాలను నివారిద్దాం

రోడ్డు ప్రమాదాలను నివారిద్దాం

అవగాహన కల్పించేందుకు సిద్దిపేటలో హాఫ్ మారథాన్ రన్నింగ్ పోటీలను ప్రారంభించిన సిద్దిపేట సీపీ డి.జోయల్ డేవిస్, ఎమ్మెల్యే సతీశ్ కుమార్ సారథి న్యూస్, హుస్నాబాద్: రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతిఒక్కరూ కృషిచేయాలని సిద్దిపేట పోలీస్ కమిషనర్ డి.జోయల్ డేవిస్ పిలుపునిచ్చారు. 32వ రోజు జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవంలో భాగంగా హుస్నాబాద్ లో జిల్లాస్థాయి హాఫ్ మారథాన్ రన్నింగ్ పోటీలు నిర్వహించారు. సిద్దిపేట, కరీంనగర్, వరంగల్, హైదరాబాద్, నల్లగొండ జిల్లాల నుంచి ఉత్సాహవంతులైన యువతీ యువకులు పాల్గొన్నారు. […]

Read More
గిరిజనులంటే నాకు ఎంతో అభిమానం

గిరిజనులంటే నాకు ఎంతో అభిమానం

సారథి న్యూస్, హైదరాబాద్: గుస్సాడి కళాకారుడు కనకరాజు తెలంగాణ రాష్ట్రం నుంచి పద్మశ్రీ పురస్కారం అందుకోవడం ఈ రాష్ట్రానికే గర్వకారణమని గవర్నర్​ తమిళసై సౌందర్​రాజన్​ అన్నారు. తనకు గిరిజనులు అంటే చాలా అభిమానమని అన్నారు. తాను గవర్నర్ కాక ముందు నుంచే గిరిజనులతో ఎంతో అవినాభావ సంబంధం కలిగి ఉన్నానని వెల్లడించారు. గిరిజనుల వైద్యానికి ప్రత్యేకత ఉందన్నారు. గిరిజనులు ఆచార వ్యహారాల వల్ల వారి వయసుకు తగినట్లుగా కాకుండా ఇంకా యవ్వనంగా ఉంటారని అన్నారు. పద్మశ్రీ అవార్డు […]

Read More
హుస్నాబాద్ పీఎస్​ఫేస్ బుక్ అకౌంట్ హ్యాక్​

హుస్నాబాద్ పీఎస్ ​ఫేస్ బుక్ అకౌంట్ హ్యాక్​

సారథి న్యూస్, హుస్నాబాద్: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పోలీస్ స్టేషన్ ఫేస్ బుక్ అకౌంట్ ను సైబర్ నేరస్తులు హ్యాక్ చేశారని ఎస్సై ఎస్.శ్రీధర్ సోమవారం విలేకరులకు తెలిపారు. వాట్సాప్, ఫేస్ బుక్, ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాల్లో వస్తున్న పలు అసత్యపు ప్రచారాలు, నేరాలను అదుపు చేసేందుకు ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఫేస్ బుక్ అకౌంట్ తెరిచామన్నారు. గుర్తుతెలియని సైబర్ నేరస్తులు హుస్నాబాద్ పోలీస్ స్టేషన్ ఫేస్ బుక్ ను హ్యాక్​చేసి, డూప్లికేట్ ఫేస్ […]

Read More