Breaking News

Month: February 2021

ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి బర్తరఫ్​చేయాలి

ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిని బర్తరఫ్​ చేయాలి

సారథి న్యూస్, వాజేడు: ఎస్సీ, ఎస్టీ, బీసీ ఆఫీసర్ల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిని బర్తరఫ్​ చేయాలని ఎమ్మార్పీఎస్ వాజేడు మండల ఇన్​చార్జ్ వావిలాల స్వామివారి గవర్నర్​ను కోరారు. ఎమ్మార్పీఎస్ మండలాధ్యక్షుడు అరికిల్ల వేణుమాదిగ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. భారతర్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ద్వారా ఎమ్మెల్యేగా ఎన్నికైన ఎమ్మెల్యే ధర్మారెడ్డి ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని అన్నారు. కులాలను బట్టి సమర్థులు, అసమర్థులుగా […]

Read More
సీఎం సహాయ నిధి చెక్కు పంపిణీ

సీఎం సహాయ నిధి చెక్కు పంపిణీ

సారథి న్యూస్, పస్రా: ములుగు జిల్లా పస్రా గ్రామంలో బుధవారం గండికోట నవీన్ కుటుంబానికి ముఖ్యమంత్రి సహాయనిధి కింద రూ.14వేల చెక్కును టీఆర్​ఎస్​ మండలాధ్యక్షుడు మురహరి భిక్షపతి అందజేశారు. ఎంపీపీ సూడి శ్రీనివాస్ రెడ్డి, గ్రామాధ్యక్షుడు చందర్ రాజు, ఎంపీటీసీ వెలిశాల స్వరూప, వార్డు సభ్యులు శ్యాం, పున్నం చందర్, రాజశేఖర్, గజ్జి మల్లికార్జున్, పట్టపు వెంకట్ రెడ్డి పాల్గొన్నారు.

Read More
పల్లె అభివృద్ధి పనులను పూర్తిచేయాలి

పల్లె అభివృద్ధి పనులను పూర్తిచేయాలి

సారథి న్యూస్, పెద్దశంకరంపేట: పెద్దశంకరంపేట మండలంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని మెదక్ డీపీవో తరుణ్ కుమార్ అధికారులకు సూచించారు. బుధవారం పెద్దశంకరంపేట ఎంపీడీవో కార్యాలయాన్ని సందర్శించి పలు రికార్డులను పరిశీలించారు. మండలంలో జరుగుతున్న అభివృద్ధి పనులు పంచాయతీ కార్యదర్శుల వివరాలను సూపరింటెండెంట్ రాజమల్లయ్యను అడిగి తెలుసుకున్నారు. గ్రామాల్లో వైకుంఠధామాలు, పల్లె ప్రకృతి వనాల పనులను తొందరగా పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీవో రియాజుద్దీన్, జూనియర్ అసిస్టెంట్ చక్రధర్, సిబ్బంది తుకారాం తదితరులు పాల్గొన్నారు.

Read More
కళ్యాణలక్ష్మి పేదలకు వరం

కళ్యాణలక్ష్మి పేదలకు వరం

సారథి న్యూస్, పెద్దశంకరంపేట: కళ్యాణలక్ష్మి పథకం పేదింటి ఆడపిల్లలకు వరం లాంటిదని నారాయణఖేడ్ ఎమ్మెల్యే ఎం.భూపాల్ రెడ్డి అన్నారు. బుధవారం పెద్దశంకరంపేటలో 84 మంది లబ్ధిదారులకు మంజూరైన కళ్యాణలక్ష్మి చెక్కులను బుధవారం ఆయన అందజేశారు. సీఎం కేసీఆర్​కళ్యాణలక్ష్మి పథకం ద్వారా రూ.1.16లక్షలు అందజేస్తున్నారని తెలిపారు. గురుకులాల్లో ఒక్కో విద్యార్థినిపై లక్షలు ఖర్చు చేస్తున్నారని వివరించారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని ప్రతిఒక్కరూ ఆర్థికంగా ఎదగాలని కోరారు. కార్యక్రమంలో మెదక్ డీపీవో తరుణ్ కుమార్, రైతుబంధు సంగారెడ్డి జిల్లా […]

Read More
తెలంగాణ జాగృతిలో పలువురి చేరిక

తెలంగాణ జాగృతిలో పలువురి చేరిక

సారథి న్యూస్, రామాయంపేట: తెలంగాణ రాష్ట్ర సంస్కృతి సంప్రదాయలను పదిమందికి చేరవేయడమే తమ ముఖ్య ఉద్దేశమని తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షురాలు పట్లోళ్ల మల్లిక అశోక్ అన్నారు.మెదక్​ జిల్లా నిజాంపేట మండలకేంద్రంలోని వ్యవసాయ సబ్ మార్కెట్ లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు తెలంగాణ జాగృతిలో చేరారు. తెలంగాణ పండుగలను ప్రపంచం నలుమూలలకు తెలియజేయడంలో మాజీ ఎంపీ, ఎమ్మెల్సీ కవిత ఎనలేని కృషిచేశారని గుర్తుచేశారు. కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా కన్వీనర్ శేఖర్, నిజాంపేట జడ్పీటీసీ పంజా […]

Read More
రాత్రి వేళ దుండగుల హల్ చల్

రాత్రివేళ దుండగుల హల్ చల్

సారథి న్యూస్, మానవపాడు: జోగుళాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం పుల్లూరు గ్రామం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​ సరిహద్దు ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తులు రాత్రి వేళల్లో హల్ చల్ సృష్టిస్తున్నారు. పొరుగు రాష్ట్రంలో మద్యం దొరక్కపోవడంతో మందుబాబులు సరిహద్దు ప్రాంతమైన పుల్లూరు గ్రామంలో నిత్యం తిరుగుతున్నారు. బయట రోడ్లపై కనిపించిన వారిని బెదిరింపులకు గురిచేస్తూ డబ్బులు, బంగారు నగలు, విలువైన వస్తువులను లాక్కెళ్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి 9 గంటలకు పుల్లూరు గ్రామానికి చెందిన విశ్వనాథ్ అనే […]

Read More
సీఎం కేసీఆర్​ పుట్టినరోజు అధిశ్రావణ యాగం

సీఎం కేసీఆర్​ పుట్టినరోజు అధిశ్రావణ యాగం

సారథి న్యూస్, హైదరాబాద్: ఫిబ్రవరి 17న తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్​రావు పుట్టినరోజు వేడుకలను ఎల్బీ స్టేడియంలో ఘనంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర్​ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా అధిశ్రావణ యాగం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. లోక కల్యాణార్థం నిర్వహిస్తున్న ఈ యాగానికి ప్రతిఒక్కరూ ఆహ్వానితులేనని స్పష్టంచేశారు. యాగానికి పదివేల మంది హాజరవుతున్నట్లు అంచనా వేస్తున్నామని వెల్లడించారు. యాగానికి హాజరయ్యే భక్తులకు స్వామివారి తీర్థ ప్రసాదం అందజేసి.. అన్నదానం చేయనున్నట్లు తెలిపారు.

Read More
అధిక దిగుబడికి సస్యరక్షణ చర్యలు తప్పనిసరి

అధిక దిగుబడికి సస్యరక్షణ తప్పనిసరి

సారథి న్యూస్, రామాయంపేట: వరి పంటలో అధిక దిగుబడులకు సరైన సస్యరక్షణ చర్యలు తీసుకోవాలని నిజాంపేట మండల వ్యవసాయాధికారి సతీష్​రైతులకు సూచించారు. మంగళవారం ఆయన నిజాంపేట మండలంలోని నందిగామ గ్రామంలో పంట పొలాలను పరిశీలించారు. వరి పంటను మొగిపురుగు ఆశిస్తే మొదటగా 3జీ లేదా 4జీ గుళికలను ఎకరాకు ఆరు లేదా 8 కిలోల చొప్పున చల్లుకోవాలని సూచించారు. అగ్గితెగులు ఆశించినట్లయితే ట్రైసాక్లోజల్ 0.6 గ్రాములు లేదా 2.25 ఎం.ఎల్ కాసుమిసిన్ వేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఏఈవో […]

Read More