Breaking News

Month: February 2021

సైబర్​ నేరాలకు చెక్​ పెడదాం

సైబర్​ నేరాలకు చెక్​ పెడదాం

సారథి న్యూస్, ములుగు: ములుగు జిల్లా ఎస్పీ క్యాంపు ఆఫీసు సముదాయంలో సైబర్ ఫోరెన్సిక్ ల్యాబ్ ను జిల్లా ఎస్పీ సంగ్రామ్​సింగ్​ జి పాటిల్​ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ పోలీస్ శాఖ అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి నేరస్తులకు శిక్షపడేలా కృషిచేయడంలో ముందంజలో ఉందన్నారు. నూతన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడంలో జిల్లాలోని పోలీసు సిబ్బంది శిక్షణ ఇవ్వాలని ఐటీకోర్ సిబ్బందిని ఆదేశించారు. సైబర్ నేరాల నియంత్రణకు సైబర్ ఫోరెన్సిక్ ల్యాబ్ […]

Read More
శభాష్​.. ఎస్సై శిరీష

శభాష్​.. ఎస్సై శిరీష

సారథి న్యూస్, శ్రీకాకుళం: ఇటీవల సోషల్​ మీడియాలో ఎస్సై శిరీష పేరు మార్మోగుతోంది. ఓ అనాథ శవాన్ని మోసుకుపోయిన ఆమెను ఎంతోమంది ప్రశంసిస్తున్నారు. మానవత్వం చాటిన ఆ మహిళా అధికారిని తాజాగా పోలీసు ఉన్నతాధికారులు సైతం ప్రశంసించి అవార్డు అందజేశారు. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ లో ఎస్సై శిరీష విధులు నిర్వహిస్తున్నారు. పలాస మండలం అడవి కొత్తూరు వద్ద ఈనెల 1న గుర్తుతెలియని శవం ఉందన్న విషయం ఎస్సై శిరీషకు అందింది. దీంతో ఆమె […]

Read More
7న టీఆర్​ఎస్​ కార్యవర్గ సమావేశం

7న టీఆర్​ఎస్​ కార్యవర్గ సమావేశం

సారథి న్యూస్​, హైదరాబాద్​: ఈనెల 7న(ఆదివారం) మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్ లో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అధ్యక్షతన టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి రాష్ట్ర కమిటీ సభ్యులతో పాటు రాష్ట్రమంత్రులు, లోక్​సభ, రాజ్యసభ సభ్యులు, శాసనమండలి సభ్యులు, రాష్ట్రస్థాయి కార్పొరేషన్ చైర్మన్లు, జడ్పీ చైర్మన్లు, మున్సిపల్ మేయర్లు, డీసీసీబీ అధ్యక్షులు, డీసీఎంఎస్​ అధ్యక్షులను ఈ సమావేశానికి ఆహ్వానించారు. పార్టీ సభ్యత్వాల పునరుద్ధరణ, గ్రామస్థాయి నుంచి స్థాయి వరకు […]

Read More
జిల్లెలగూడ చెరువుకు కొత్త సొబగులు

జిల్లెలగూడ చెరువుకు కొత్త సొబగులు

సారథి న్యూస్, హైదరాబాద్: సుమారు రూ.3.65 కోట్ల వ్యయంతో సుందరీకరణ పనులు చేపట్టిన హైదరాబాద్​లోని జిల్లెలగూడ చందనం చెరువును శుక్రవారం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రజలకు అంకితం చేశారు. చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్, ఫెన్సింగ్​, బతుకమ్మ ఘాట్, ప్లాంటింగ్, ఐలాండ్, పక్షులు, జంతువుల బొమ్మలతో చేపట్టిన పనులు స్థానికులను ఆకట్టుకుంటున్నాయి. కాంక్రీట్​ జంగిల్​గా మారుతున్న పట్టణ ప్రాంతాల్లో ప్రజలు సేదతీరడానికి చెరువు పరిసరాలు, పార్కులు దోహదపడతాయని, గొలుసుకట్టు చెరువులను దశలవారీగా అభివృద్ధి చేస్తామని మంత్రి […]

Read More
రామమందిర నిర్మాణానికి నిధి సేకరణ

రామమందిర నిర్మాణానికి నిధి సేకరణ

సారథి న్యూస్, నిజాంపేట/పెద్దశంకరంపేట: అయోధ్య రామమందిరం నిర్మాణం కోసం ఊరూరా నిధుల సేకరణ చేస్తున్నారు. శుక్రవారం మెదక్​ జిల్లా నిజాంపేట మండలంలోని నస్కల్ గ్రామంలో నిధి సేకరణ కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో వీహెచ్ఎస్​ అధ్యక్షుడు రమేశ్ గౌడ్, కార్యదర్శి అరవింద్ గౌడ్, ఆర్యవైశ్య సంఘం మండలాధ్యక్షుడు చెర్విరాల ప్రవీణ్ కుమార్, నరేష్, రాజు, నవీన్, విజయ్ మోహన్ పాల్గొన్నారు. అలాగే పెద్దశంకరంపేటలో శేషాచారి కుమారులు రామచంద్రాచారి, వేణుగోపాల్ చారి, మురళి పంతులు రామమందిరం నిర్మాణానికి రూ.51,116 అందజేశారు. […]

Read More
మంత్రి బ్యాటింగ్.. ఎమ్మెల్యే బౌలింగ్

మంత్రి బ్యాటింగ్.. ఎమ్మెల్యే బౌలింగ్

సారథి న్యూస్, హుస్నాబాద్: యువతకు క్రీడలు చాలా అవసరమని, గ్రామీణ ఆటలు బాగా ఆడించాలని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి టి.హరీశ్ రావు పిలుపునిచ్చారు. మండల కేంద్రమైన కోహెడలో సీఎం కేసీఆర్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని టీఆర్ఎస్​వీ ఆధ్వర్యంలో హుస్నాబాద్ నియోజకవర్గస్థాయి క్రికెట్ టోర్నమెంట్ క్రీడలను మంత్రి హరీశ్ రావు బుధవారం వీక్షించారు. ఈ మేరకు హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీశ్ కుమార్​ బౌలింగ్ చేయగా, మంత్రి బ్యాటింగ్ చేస్తూ.. వినూత్నరీతిలో షాట్లు కొట్టి అక్కడి వారందరినీ అలరించారు. ఈ […]

Read More
పంట మార్పిడితో రైతులకు మేలు

పంట మార్పిడితో రైతులకు మేలు

సారథి న్యూస్, చిన్నశంకరంపేట: రైతులు ఒకే రకం పంట పండించకుండా పంట మార్పిడి నేర్చుకోవాలని మెదక్​ జిల్లా చిన్నశంకరంపేట వ్యవసాయ అధికారి శ్రీనివాస్ రైతులకు సూచించారు. బుధవారం గవ్వలపల్లిలో రైతువేదికలో అపరాలు, నూనెగింజల పంటలపై రైతులతో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. రైతులకు ఉన్న సందేహాలను నివృత్తి చేశారు. అనంతరం రైతులకు విత్తనాలను పంపిణీచేశారు. మెదక్ జిల్లాలో మంత్రి హరీశ్​ రావు, ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి చేతుల మీదుగా మొట్టమొదటి రైతు వేదికను ప్రారంభించడంతో పాటు, మొట్టమొదటి […]

Read More
క్రికెట్​ కప్​ చాంపియన్​ బిజినేపల్లి

క్రికెట్​ కప్​ చాంపియన్​ బిజినేపల్లి

సారథి న్యూస్​, బిజినేపల్లి: బిజినేపల్లి మండలంలోని వెలుగొండ గ్రామంలో నిర్వహించిన జిల్లా స్థాయి క్రికెట్ పోటీలు మొదటి బహుమతి పొందిన బిజినేపల్లి క్రికెట్ జట్టుకు కప్​ను ఎంపీపీ శ్రీనివాస్ గౌడ్ బుధవారం అందజేశారు. ద్వితీయ బహుమతి లట్టుపల్లి క్రికెట్ జట్టుకు బహుమతులు ప్రదానం చేశారు. విన్నర్​కు రూ.10,116 నగదు, రన్నర్ జట్టుకు రూ.5,116 నగదు బహుమతి అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ కురువమ్మ, ఎంపీటీసీ సరోజనమ్మ ఉపసర్పంచ్ నాగేశ్, టీఆర్ఎస్ నాయకులు రాంరెడ్డి, మల్లేష్, యువజన సంఘం నాయకులు […]

Read More