Breaking News

Month: February 2021

జిల్లా, మండల పరిషత్ లకు ప్రత్యేక నిధులు

జిల్లా, మండల పరిషత్ లకు ప్రత్యేక నిధులు

పంచాయతీల మాదిరిగానే నిర్ధిష్టమైన విధులు పంచాయతీలు నిధులను సంపూర్ణంగా వాడుకోవచ్చు ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో సీఎం కేసీఆర్​ సారథి న్యూస్, హైదరాబాద్: స్థానిక స్వపరిపాలన సంస్థలను బలోపేతం చేసి, గ్రామీణాభివృద్ధిలో వారి పాత్రను మరింత క్రియాశీలం చేస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. గ్రామ పంచాయతీలకు ప్రస్తుతం ఇస్తున్న మాదిరిగానే జిల్లా, మండల పరిషత్ లకు కూడా నిధులు కేటాయిస్తామని, నిర్ధిష్టమైన విధులు అప్పగిస్తామని వెల్లడించారు. మండల, జిల్లాస్థాయి అధికారుల అనుమతులు అవసరం లేకుండానే, గ్రామ పంచాయతీలు […]

Read More
15 నుంచి అప్పర్​ప్రైమరీ స్కూళ్లను ప్రారంభించండి: యూటీఎఫ్​

15 నుంచి అప్పర్​ ప్రైమరీ స్కూళ్లను ప్రారంభించండి: యూటీఎఫ్​

సారథి న్యూస్, హైదరాబాద్: ఈనెల 15 నుంచి ప్రాథమికోన్నత పాఠశాలలు, 22 నుంచి ప్రాథమిక పాఠశాలలను ప్రారంభించాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్(టీఎస్ యూటీఎఫ్) రాష్ట్ర కమిటీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కె.జంగయ్య, చావ రవి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి చిత్రారామచంద్రన్ కు లేఖ రాశారు. ఈనెల మొదటి 1 నుంచి 9, 10 ఆపై తరగతులు ప్రారంభమై సజావుగా కొనసాగుతున్నాయని వివరించారు. పొరుగు రాష్ట్రంలో కూడా […]

Read More
ఆరోగ్యంగానే ఉన్నా.. నేనే కొనసాగుతా

ఆరోగ్యంగానే ఉన్నా.. నేనే ఉంటా

తెలంగాణ ముఖ్యమంత్రి మార్పు ఉండబోదు క్లారిటీ ఇచ్చిన సీఎం కె.చంద్రశేఖర్​రావు టీఆర్ఎస్​ కార్యవర్గ సమావేశంలో వెల్లడి సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి మార్పు ఉండబోదని టీఆర్ఎస్​అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు స్పష్టత ఇచ్చారు. ఈ అంశంపై కొద్దిరోజులుగా జరుగుతున్న ప్రచారాన్ని ఆయన కొట్టిపారేశారు. సీఎంగా తానే కొనసాగుతానని తేల్చిచెప్పారు. ఆదివారం తెలంగాణ భవన్​లో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రిగా తానే ఉంటానని అసెంబ్లీ సాక్షిగా ఇంతకుముందే చెప్పినా ఎందుకు […]

Read More
ఘనంగా రమాబాయి జయంతి

ఘనంగా రమాబాయి జయంతి

సారథి న్యూస్, రామాయంపేట/ పెద్దశంకరంపేట: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్​బీఆర్​ అంబేద్కర్​సతీమణి రమాబాయి అంబేద్కర్​జయంతి వేడుకలను మెదక్​జిల్లావ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. నిజాంపేట మండల కేంద్రంలో ఉపసర్పంచ్ కొమ్మట బాబు ఆధ్వర్యంలో ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో బెల్ల సిద్ధరాములు, గుడ్ల మల్లేశం, సందీప్, సురేష్, మహేష్, శ్రీనివాస్, రవి పాల్గొన్నారు. అలాగే పెద్దశంకరంపేట మండల కేంద్రంలో బహుజన సంఘాల ఆధ్వర్యంలో జయంతిని నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఆలిండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర […]

Read More
17న కోటి వృక్షార్చన

17న కోటి వృక్షార్చన

సారథి న్యూస్, హైదరాబాద్: గ్రీన్ ఇండియా చాలెంజ్​లో భాగంగా కోటి వృక్షార్చన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఎంపీ, రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్. ఈ నెల 17న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదిన సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా కోటి మొక్కలు నాటే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టినట్లు ఆయన తెలిపారు. వృక్షార్చన పోస్టర్ ను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కె.కవిత, వరంగల్, ఖమ్మం, నల్లగొండ ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీమంత్రి సి.లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.

Read More
పెద్దశంకరంపేటలో భారీ శోభాయాత్ర

పెద్దశంకరంపేటలో భారీ శోభాయాత్ర

సారథి న్యూస్​, పెద్దశంకరంపేట: అయోధ్యలో భవ్యమైన రామమందిర నిర్మాణం కోసం నిధి సేకరణలో భాగంగా ఆదివారం మెదక్​ జిల్లా పెద్దశంకరంపేటలో ఆదివారం భారీ శోభాయాత్ర నిర్వహించారు. నారాయణఖేడ్ నియోజకవర్గం నేత సంగమేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో పెద్దశంరంపేట వేంకటేశ్వర ఆలయం నుంచి పట్టణ పురవీధుల గుండా ఈ యాత్ర సాగింది. కాషాయ జెండాలు చేతపట్టి జై శ్రీ రామ్! నినాదాలు చేస్తూ ముందుకు సాగారు. కార్యక్రమంలో కరణ్ భారతి మహారాజ్, హిందువులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Read More
12న కలెక్టరేట్​ముట్టడి

12న కలెక్టరేట్ ​ముట్టడి

సారథి న్యూస్, బిజినేపల్లి: ఈనెల 12న జరిగే కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.శ్రీనివాసులు డిమాండ్ చేశారు. ఆదివారం బిజినేపల్లి మండల కేంద్రంలో గ్రామపంచాయతీ ఎంప్లాయీస్, వర్కర్స్ యూనియన్ మండల జనరల్ బాడీ మీటింగ్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పంచాయతీ ఉద్యోగ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, రాష్ట్ర తొలి పీఆర్సీ సిఫార్సుల ప్రకారం రూ.19వేల జీతం ఇవ్వాలని కోరారు. మల్టీ పర్పస్ విధానాన్ని రద్దుచేయాలని, కారోబార్, బిల్ కలెక్టర్లకు […]

Read More
మల్కపేట ప్యాకేజీ- 9 పనులను కంప్లీట్​చేయాలే

మల్కపేట ప్యాకేజీ- 9 పనులను కంప్లీట్​ చేయాలే

సారథి న్యూస్​, రాజన్న సిరిసిల్ల: మల్కపేట ప్యాకేజీ- 9 పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి స్మితా సబర్వాల్ సూచించారు. టన్నెల్ లో ప్రతిరోజు సుమారు 80 మీటర్ల మేర లైనింగ్ పనులు చేసేలా చూడాలని ఆదేశించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న ప్యాకేజీ 9 పనులపై శనివారం ఆమె సమీక్షించారు. సాధ్యమైనంత త్వరగా పూర్తిచేసేలా చూడాలని సంబంధిత అధికారులను కాంట్రాక్టర్లను ఆదేశించారు. టన్నెల్ లో సుమారు 80 మీటర్ల మేర లైనింగ్ […]

Read More