Breaking News

Month: October 2020

వడ్ల కొనుగోళ్లు షురూ

వడ్ల కొనుగోళ్లు షురూ

సారథి న్యూస్, రామాయంపేట: మెదక్ జిల్లా నిజాంపేట మండలంలోని నస్కల్, రాంపూర్, చల్మేడ గ్రామాల్లో శుక్రవారం రామాయంపేట సహకార సంఘం ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు సెంటర్లను చైర్మన్ బాదె చంద్రం, నిజాంపేట ఎంపీపీ సిద్ధరాములు కలసి ప్రారంభించారు. రైతులు ఈ కొనుగోలు సెంటర్లను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ‘ఏ’ గ్రేడ్ వరి ధాన్యానికి రూ.1,888, సాధారణ రకానికి రూ.1,868 కేటాయించినట్లు తెలిపారు. కార్యక్రమంలో సీఈవో నర్సింలు, సొసైటీ డైరెక్టర్ సుధాకర్ రెడ్డి, కో ఆప్షన్ సభ్యుడు గౌస్, […]

Read More
‘ధరణి’ పూర్తిగా పారదర్శకం

‘ధరణి’ పూర్తిగా పారదర్శకం

ఒక క్లిక్​తో భూముల వివరాలను ఎక్కడైనా చూసుకోవచ్చు రిజిస్ట్రేషన్ ప్రక్రియ 15 నిమిషాల్లోనే పూర్తి సబ్ రిజిస్ట్రార్ ​ఆఫీసులుగా తహసీల్దార్ కార్యాలయాలు పాత రిజిస్ట్రేషన్ చార్జీలే వర్తిస్తాయి.. ‘ధరణి’ పోర్టల్ ​ప్రారంభంలో సీఎం కె.చంద్రశేఖర్​రావు సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఎంతో శ్రమించి తీసుకొచ్చిన ధరణి పోర్టల్ పూర్తి పారదర్శకంగా ఉంటుందని, 1,45,58,000 ఎకరాల భూములు ఇందులో దర్శనమిస్తున్నాయని సీఎం కె.చంద్రశేఖరావు అన్నారు. భూముల వివరాలను దేశవిదేశాల్లో ఉన్న వారు ఎవరైనా చూసుకోవచ్చన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న […]

Read More
‘ధరణి’సేవల పరిశీలన

‘ధరణి’ సేవల పరిశీలన

సారథి న్యూస్, బిజినేపల్లి: రెవెన్యూ సేవలను సులభంగా, పారదర్శకంగా అందించాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన ధరణి పోర్టల్​ను సీఎం కె.చంద్రశేఖర్​రావు గురువారం ప్రారంభించారు. పోర్టల్​ను తహసీల్దార్​అంజిరెడ్డి, మండల ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు కురుమయ్య, పీఏసీఎస్​చైర్మన్​బాలరాజు గౌడ్, ఎంపీపీ శ్రీనివాస్ గౌడ్, మహేష్ రెడ్డి, మంగి విజయ్, బాలస్వామి, తిరుపతిరెడ్డి, పులిందర్ రెడ్డి పరిశీలించారు.

Read More
దుబ్బాకలో ప్రతిపక్షాలకు దిమ్మతిరిగే తీర్పు

దుబ్బాకలో ప్రతిపక్షాలకు దిమ్మతిరిగే తీర్పు

సారథి న్యూస్, హైదరాబాద్: మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావు తెలంగాణ భవన్​లో గురువారం చిట్ చాట్ చేశారు. ఆర్ బీఐ తాజా నివేదిక ప్రకారం వ్యవసాయ రుణాలు అత్యధికంగా మాఫీ చేసిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందన్నారు. మా డబ్బా మేం కొట్టుకోవడం కాదు. ఇది ఆర్​బీఐ నివేదిక చెబుతుందన్నారు. మొత్తం రూ.27,718 కోట్లు రుణమాఫీకి నిధులు వెచ్చించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికే దక్కిందన్నారు. రైతుబంధుకు మరో రూ.28వేల కోట్లు జమచేశామన్నారు. రైతుబీమా, ఇన్​పుట్ సబ్సిడీకి […]

Read More
పంట ఎండింది.. గుండె మండింది

పంట ఎండింది.. గుండె మండింది

సారథి న్యూస్, రామాయంపేట: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రైతన్నలు వేసిన సన్నరకం వరి దోమకాటు బారినపడింది. చేసేదిలేక రైతులు బుధవారం పంటకు నిప్పంటించారు. నిజాంపేట మండలంలోని చల్మెడ గ్రామానికి చెందిన రైతు దొంతరబోయిన మధుకు చెందిన ఎకరాన్నర పొలంలో దోమకాటుకు పంట నాశనమైంది. మందులు కొట్టి పంటను బతికించుకోలేక నిప్పంటించాడు. ఈ సన్నరకం వరి వేసిన నాలాంటి రైతులు ఎందరో బలవుతున్నారని, ప్రభుత్వం స్పందించి దోమకాటుకు బలైన రైతులను ఆదుకోవాలని దొంతర బోయిన మధు, […]

Read More
9 మందిని చంపిన.. రాక్షసుడికి ఉరిశిక్ష

9 మందిని చంపిన.. రాక్షసుడికి మరణశిక్ష

సారథి న్యూస్, వరంగల్: తన క్రూరమైన ఆలోచనలతో ఒకేరోజు 9 మందిని హత్యచేసిన నిందితుడు, బీహార్​కు చెందిన సంజయ్ కుమార్ కు కోర్టు బుధవారం ఉరిశిక్ష ఖరారు చేసింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన గీసుగొండ మండలం గోర్రెకుంటలో 9మందిని హత్యచేసి బావిలో పడవేసిన ఘటన తెలిసిందే. ఫాస్ట్​ట్రాక్​ కోర్టులో విచారణ అనంతరం వరంగల్ న్యాయస్థానం తీర్పును వెలువరించింది. మృతుల వివరాలు:మహమ్మద్ మక్సూద్ ఆలం(47), మహమ్మద్ నిషా అలం(40), మహమ్మద్ బుద్రా కాటూన్(20), బబ్లూ(3), మహమ్మద్ షాబాజ్(19), మహ్మద్​సొహైల్​(18), […]

Read More
టీడీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత రాజీనామా

టీడీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత రాజీనామా

అమరావతి: టీడీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత తన పదవికి రాజీనామా చేశారు. బుధవారం ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ శాసన మండలి చైర్మన్‌కు తన రాజీనామా పత్రాన్ని పంపించారు. రాష్ట్రంలో టీడీపీ చేస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్టు ఆమె ప్రకటించారు. టీడీపీ కొద్దిరోజులుగా ఏపీ అభివృద్ధికి అడ్డుపడుతూ.. బీసీ, ఎస్సీ, ఎస్టీ వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న అభివృద్ధిని, సంక్షేమ పథకాలను టీడీపీ అడ్డుకుంటుందని […]

Read More
అన్​లాక్​-6.0 కొత్త నిబంధనలు

అన్​లాక్​-6.0 కొత్త నిబంధనలు

న్యూఢిల్లీ: అన్​లాక్​-6.0 కొత్త నిబంధనలను కేంద్రం విడుదల చేసింది. కరోనా మహమ్మారి విస్తరణ కొనసాగుతున్నందున సెప్టెంబర్‌ 30న ఇచ్చిన ఆదేశాలను మరోనెల రోజులు పొడిగిస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీచేసింది. కరోనా విస్తరణ ఇంకా కొనసాగుతున్నందున జాగ్రత్తగా ఉండాల్సిందేనని కేంద్రం సూచించింది. కంటైన్మెంట్‌ జోన్లలో అన్ని రకాల ఆంక్షలు కొనసాగుతాయని స్పష్టంచేసింది. కంటైన్మెంట్‌ జోన్ల బయట… దాదాపు అన్ని రకాల కార్యకలాపాలకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపింది. కంటైన్మెంట్‌ జోన్ల బయట రాష్ట్రాలు లాక్​డౌన్​విధించకూడదని తాజా మార్గదర్శకాల్లో చెప్పింది. […]

Read More