Breaking News

Month: July 2020

నల్లవాగుకు జలకళ

నయనానందకరం నల్లవాగు

నారాయణఖేడ్, సారథి న్యూస్: సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ డివిజన్ పరిధిలోని సిర్గాపూర్ మండలంలోని నల్లవాగు ప్రాజెక్ట్​ జలకళను సంతరించుకున్నది. బుధవారం స్థానిక ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్​రెడ్డి నల్లవాగుకు పూజలు చేశారు. అనంతరం గేట్​ను ఎత్తి నీటి విడుదల చేశారు. కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు వెంకట్ రామ్ రెడ్డి, డీసీసీబీ జిల్లా డైరెక్టర్ నరేందర్ రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్​ రమావత్ రాంసింగ్, ఎంపీపీ మహిపాల్ రెడ్డి, జెడ్పీటీసీ రాఘవరెడ్డి, కల్హేర్ జెడ్పీటీసీ నర్సింహా […]

Read More

కాంట్రాక్ట్​ కార్మికులను ఆదుకోండి

సారథిన్యూస్​, గోదావరిఖని: సింగరేణి కాంట్రాక్ట్​ కార్మికులను ఆదుకోవాలని సీఐటీయూ నాయకులు డిమాండ్​ చేశారు. కాంట్రాక్ట్​ కార్మికులకు కోవిడ్ క్వారంటైన్ వేతనంతో కూడిన సెలవులు ఇవ్వాలని డిమాండ్​ చేశారు. ఈ మేరకు సింగరేణి ఎండీకి లేఖ పంపినట్టు సీఐటీయూ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు తిరుపతి, మధు తెలిపారు. సింగరేణిలో కాంట్రాక్ట్​, పర్మినెంట్​ కార్మికులందరినీ కరోనా మహమ్మారి వెంటాడుతున్నదని వారు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పర్మినెంట్​ ఉద్యోగులకు కల్పిస్తున్న సౌకర్యాలను కాంట్రాక్ట్​ ఉద్యోగులకు కూడా కల్పించాలని డిమాండ్​ చేశారు.

Read More
సింగరేణి లాక్​డౌన్​

లాక్​డౌన్​ ప్రకటించండి

సారథిన్యూస్​, గోదావరిఖని: సింగరేణిలో లాక్​డౌన్​ ప్రకటించి కార్మికుల ప్రాణాలు కాపాడాలని కార్మిక సంఘాల నాయకులు డిమాండ్​ చేశారు. బుధవారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్, ఏఐటీయూసీ, సింగరేణి కాలరీస్​ ఎంప్లాయీస్​ యూనియన్​, సీఐటీయూ నాయకులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సింగరేణిలో కరోనా వైరస్ లక్షణాలతో కార్మికులు చనిపోతున్నారని పేర్కొన్నారు. ఉద్యోగులు విధులు నిర్వర్తించడానికి ఎంతో భయపడతున్నారని చెప్పారు. ఈ విషయంపై ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళన చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ […]

Read More
శాంతియుతంగా బక్రీద్​

బక్రీద్​ శాంతియుతంగా జరుపుకోండి

సారథి న్యూస్, బెజ్జంకి: ముస్లిం సోదరులు బక్రీద్​ పండుగను శాంతియుతంగా జరుపుకోవాలని చేర్యాల సీఐ శ్రీనివాసరెడ్డి సూచించారు. బుధవారం ఆయన కరీంనగర్​ జిల్లా చేర్యాలలో ముస్లిం మత పెద్దలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. గోవులను అక్రమంగా రవాణాచేస్తే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇందుకోసం ప్రత్యేకంగా చెక్​పోస్టులు ఏర్పాటుచేశామన్నారు. మత ఘర్షణలు ప్రేరేపించేలా ఎవరైనా సోషల్​మీడియాలో పోస్టులు పెడితే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో చేర్యాల ఎస్సై మోహన్ బాబు, చేర్యాల తాజుమ్ ప్రెసిడెంట్ అబ్దుల్ […]

Read More
ప్రముఖ దర్శకుడు రాజమఃలికి కరోనా

దర్శకుడు రాజమౌళికి కరోనా

సారథి న్యూస్​, హైదరాబాద్‌: సినీ, రాజకీయ ప్రముఖులు వరుసగా కరోనా బారిన పడుతున్నారు. తాజాగా ప్రముఖ దర్శకుడు రాజమౌళికి కరోనా పాజిటివ్​ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ట్విట్టర్​ ద్వారా వెల్లడించారు. ఆయనతో పాటు కుటుంబసభ్యులకు కూడా కరోనా సోకినట్టు సమాచారం. ‘నేను, నా కుటుంబసభ్యులు కొద్ది రోజులుగా తేలికపాటి జ్వరంతో బాధపడ్డాం. అయితే ఆ తర్వాత జ్వరం తగ్గిపోయింది. కానీ మేము కరోనా టెస్ట్‌ చేయించుకున్నాం. మాకు కోవిడ్‌ పాజిటివ్‌గా తేలింది. […]

Read More

ఉద్దవ్​ థాక్రేను ఆహ్వానించలేదు

  • July 29, 2020
  • Comments Off on ఉద్దవ్​ థాక్రేను ఆహ్వానించలేదు

అయోధ్య(ఉత్తరప్రదేశ్): అయోధ్యలోని రామాలయం భూమి పూజ కార్యక్రమానికి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మినహా ముఖ్యమంత్రులు ఎవరికీ ఆహ్వానం లేదని రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు తాజాగా ప్రకటించింది. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేను భూమి పూజ కార్యక్రమానికి ఆహ్వానించలేదని విశ్వహిందూ పరిషత్ కార్యనిర్వాహక అధ్యక్షుడు అలోక్ కుమార్ చెప్పారు. రామాలయం నిర్మాణం కోసం పోరాడిన కీలకవ్యక్తులైన లాల్​ కృష్ణ అద్వాణీ, మురళీ మనోహర్ జోషి, ఉమాభారతి, వినయ్ కటియార్, సాథ్వీ రితంబర, మాజీ సీఎం కల్యాణ్ […]

Read More
కరోనా మృతులకు ప్రత్యేక శ్మశానవాటిక

కరోనా మృతులకు ప్రత్యేక శ్మశానవాటికలు

సారథి న్యూస్​, వరంగల్: కరోనా బారినపడి మరణించిన వారి దహనానికి ప్రత్యంగా శ్మశానవాటికల ఏర్పాటుకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని మహానగర పాలక సంస్థ కమిషనర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. బుధవారం వారితో సమీక్షించారు. హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్ల కోసం వేర్వేరుగా ప్రత్యేక స్థలాలను గుర్తించాలన్నారు. మృతదేహాలను శ్మశానవాటికలకు తరలించడానికి అంబులెన్సులను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. డీఎఫ్ వో కిశోర్ ఆధ్వర్యంలో 12 మంది సిబ్బందితో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటుచేసినట్లు వివరించారు. హోం క్వారంటైన్​కు మున్సిపల్ గెస్ట్​హౌస్​, […]

Read More
అన్నింటికీ సౌలత్​ ఉండాలె

అన్నింటికీ సౌలత్​ ఉండాలె

నూతన సెక్రటేరియట్ పై సీఎం కేసీఆర్​ సారథి న్యూస్​, హైదరాబాద్​: నూతన సెక్రటేరియట్ నిర్మాణానికి సంబంధించిన డిజైన్లను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పరిశీలించారు. వీటిలో కొన్ని మార్పులను సూచించారు. కొత్త సెక్రటేరియట్ భవనం నిర్మాణంపై బుధవారం ప్రగతి భవన్ లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సెక్రటేరియట్ లో అందరూ పనులు చేసుకోవడానికి అనుకూలంగా అన్ని సౌకర్యాలు ఉండేలా చూడాలని ఆదేశించారు. కొత్త సెక్రటేరియట్ లో మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కార్యదర్శులు, సలహాదారుల […]

Read More