Breaking News

Month: July 2020

పార్లమెంట్ భవనాన్ని కూల్చేస్తాం : కేంద్రం

పార్లమెంట్ భవనాన్ని కూల్చేస్తాం : కేంద్రం

న్యూఢిల్లీ : ప్రస్తుత పార్లమెంట్ భవనం పురాతనమైందని, దాన్ని కూల్చేస్తామని కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం మంగళవారం సుప్రీంకోర్టులో ఓ అఫిడవిట్‌ను దాఖలు చేసింది. ప్రస్తుత పార్లమెంట్ భవనం 100 ఏళ్ల పురాతన భవనమని, భద్రతాపరంగా చాలా ఇబ్బందులు తలెత్తుతున్నాయని కేంద్రం పేర్కొంది. అంతేకాకుండా ఏవైనా తీవ్రమైన అగ్నిప్రమాదాలు సంభవిస్తే కూడా కష్టమేనని ఆ అఫిడవిట్‌లో తెలిపింది. అందుకే ఇదే స్థలంలో నూతన పార్లమెంట్ భవనాన్ని నిర్మిస్తామని కేంద్రం తెలిపింది. ‘ఈ భవనాన్ని 1921 […]

Read More
డీఎంహెచ్ వో గా చందూ నాయక్

డీఎంహెచ్ వో గా చందూ నాయక్

సారథి న్యూస్​ : జోగులాంబ గద్వాల జిల్లా  డీఎంహెచ్​వో( జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి)గా డాక్టర్ చందూ నాయక్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో రంగారెడ్డిలో పని చేసిన ఈయన జిల్లా ఇంచార్జీ డీఎంహెచ్​వోగా రావడం జరిగింది.

Read More
కరోనా పేషెంట్ల కోసం హాస్పిటల్.. భేష్​

కరోనా పేషెంట్ల కోసం హాస్పిటల్.. భేష్​

సారథి న్యూస్, హైదరాబాద్: కరోనా పేషెంట్ల కోసమే ప్రత్యేకంగా ఆస్పత్రిని ఏర్పాటు చేయడం అభినందనీయమని మంత్రి తన్నీరు హరీశ్​రావు అన్నారు. బుధవారం హైదరాబాద్​లోని మాదాపూర్​లో సిగ్మా హాస్పిటల్ ను ఆయన ప్రారంభించారు. ప్రస్తుత క్లిష్టపరిస్థితుల్లో నిష్ణాతులైన వైద్యుల బృందం ఆధ్వర్యంలో కరోనా పేషెంట్లు కోసమే ప్రత్యేకంగా హాస్పిటల్ ను ప్రారంభించడం అభినందనీయమన్నారు. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కరోనా నివారణ కోసం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందన్నారు. కరోనా నిర్ధారణ పరీక్షల ప్రక్రియ వేగంగా […]

Read More
ఆగస్టు 14వరకు లాక్డౌన్

ఆగస్టు 14 వరకు లాక్​డౌన్​

సారథి న్యూస్​, కోదాడ : పట్టణంలో రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులు దృష్ట్యా ఈ నెల 31నుంచి ఆగస్టు 14వరకు లాక్​డౌన్​ విధించనున్నట్లు కోదాడ మున్సిపల్​ కమిషనర్​ మల్లారెడ్డి బుధవారం ప్రకటన విడుదల చేశారు. వైరస్​ను కట్టడి చేసేందుకు స్థానిక ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్​, రెవెన్యూ, పోలీసుల సహకారంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. అత్యవసర సేవలకు, మెడికల్​ షాపులకు లాక్​ డౌన్​ నుంచి మినహాయింపు ఇవ్వనున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ15రోజులపాటు స్వీయ నిర్బంధం పాటించాలని కమిషనర్​ […]

Read More
నిజాం కుమార్తె కన్నుమూత

నిజాం కుమార్తె కన్నుమూత

సారథి న్యూస్​ : చార్మినార్‌ ఏడో నిజాం మీర్‌ ఉస్మాన్‌అలీఖాన్‌ కుమార్తె సాహెబ్‌జాదీ బషీరున్నీసాబేగం(93) పురానీహవేలీ నిజాం మ్యూజియం ఆవరణంలోని ఉస్మాన్‌కాటేజ్‌ భవనంలో కన్నుమూశారు. ఏడో నిజాంకు 21 సంవత్సరాల వయసులో 1906 ఏప్రిల్‌ 14న ఆజం ఉన్నీసాబేగంతో వివాహమైంది. ఆయనకు మొత్తం 34 మంది సంతానం. ఆయన సంతానంలో ఇప్పటి వరకు జీవించి ఉన్నది ఈమె ఒక్కరే. బషీరున్నీసాబేగం 1927లో జన్మించారు. దక్కన్‌ హైదరాబాదీ సంస్కృతిని ప్రతిబింబించేలా నగలు ధరించేవారు. ఈమె భర్త నవాబ్‌ ఖాజీంయార్‌జంగ్‌ […]

Read More
పెరుగుతున్న కరోనా కేసుల సంఖ్య

15 లక్షలు దాటిన కరోనా కేసులు

ఢిల్లీ: ఇండియాలో కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 15,31,669 మంది కరోనా బారినపడ్డారు. కేవలం గత 24 గంటల్లోనే 48,513 కొత్త కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం దేశంలో 5,09,447 యాక్టివ్​ కేసులు ఉన్నాయి. 34,193 మంది కరోనాతో మృతిచెందారు. 9,88,028 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రజలంతా స్వీయ జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యశాఖ అధికారులు సూచిస్తున్నారు. త్వరలో కేసుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని చెప్పారు.

Read More
మధ్యప్రదేశ్​ మంత్రికి కరోనా

మధ్యప్రదేశ్​ మంత్రికి కరోనా

భోపాల్​: మధ్యప్రదేశ్​ మంత్రి తుల్సీ సిలావత్​, అతడి భార్యకు కరోనా పాజిటివ్​గా నిర్ధారణ అయింది. ఇటీవలే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివ్​రాజ్​సింగ్​ చౌహాన్​కు కరోనా వచ్చిన విషయం తెలిసిందే. దీంతో తనతో కాంటాక్ట్​ అయిన వాళ్లంతా పరీక్షలు చేయించుకోవాలని సీఎం సూచించారు. ఈ నేపథ్యంలో మంత్రులందరికీ పరీక్షలు చేయగా తుల్సీ సిలావత్​కు కరోనా పాజిటివ్​గా నిర్ధారణ అయ్యింది. ఆయన ప్రస్తుతం భోపాల్​లోని ఓ ప్రైవేట్​ దవాఖానలో చికిత్స పొందుతున్నారు. మధ్యప్రదేశ్​లోని పలువురు అధికారులు, పోలీస్​ సిబ్బందికి కూడా […]

Read More
అశోక్​ గెహ్లాట్​కు ఈడీ షాక్​

అశోక్​ గెహ్లాట్​కు ఈడీ షాక్​

జైపూర్​: సచిన్​ పైలట్​ సృష్టించిన సంక్షోభంతో ఉక్కిరిబిక్కిరవుతున్న రాజస్థాన్​ సీఎం అశోక్​ గెహ్లాట్​కు ఈడీ షాక్​ ఇచ్చింది. అతడి సోదరుడు అగ్రసేన్​ గెహ్లాట్​కు ఈడీ (ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​) సమన్లు జారీచేసింది. అగ్రసేన్​ రూ.150 కోట్ల ఎరువుల కుంభకోణానికి పాల్పడినట్లు అతడిపై ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈడీ అగ్రసేన్​ను ప్రశ్నించనుంది. ఈనెల 22న ఈడీ అధికారులు అగ్రసేన్​కు చెందిన ఎరువుల కంపెనీపై దాడి చేసి.. పలు కీలకపత్రాలను స్వాధీనం చేసుకున్నారు. బీజేపీ.. ఈడీని అడ్డం పెట్టుకొని కుట్రలు […]

Read More