Breaking News

Day: June 4, 2020

అదనపు గదులు ప్రారంభం

సారథి న్యూస్​, నారాయణపేట: నారాయణపేట జిల్లా మద్దూర్ మండలం నిడ్జింత గ్రామంలో రూ.73 లక్షల వ్యయంతో నిర్మించిన అదనపు తరగతి గదులను మంత్రులు ఎక్సైజ్​శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గురువారం ప్రారంభించారు. కలెక్టర్ హరిచందన, ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read More

తెలుగు ఐఏఎస్‌ అధికారి కోటా రవికి కీలక బాధ్యతలు

సారథి న్యూస్, శ్రీకాకుళం: అమెరికాలో భారత ప్రత్యేక ఆర్థిక దౌత్యవేత్తగా సంతబొమ్మాళి మండలం, కోటపాడు గ్రామానికి చెందిన ఐఏఎస్ అధికారి కోటా రవి నియమితులయ్యారు. వాషింగ్టన్‌లోని రాయబార కార్యాలయంలో సంయుక్త కార్యదర్శి హోదాలో ఎకానమిక్‌ మినిస్టర్‌గా విధులు నిర్వహించనున్నారు. మూడేళ్లపాటు ఈ పదవిలో కొనసాగనున్న రవి భారత్ తరఫున ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి వ్యవహారాలను పర్యవేక్షించనున్నారు. ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన సమావేశమైన కేబినెట్‌ నియామకాల కమిటీ గురువారం ఆయనకు కీలక బాధ్యతలు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. […]

Read More

ధీరవనిత ఝల్కారీబాయి

సారథి న్యూస్​, వనపర్తి: వనపర్తి జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కాలేజీ ఆవరణలో వీరనారి ఝల్కారీబాయి 162 వర్ధంతిని టీజేఏసీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ప్రజావాగ్గేయకారుడు రాజారామ్ ప్రకాష్ మాట్లాడుతూ.. దేశానికి స్వాతంత్ర్యం కావాలని పోరాటం కొనసాగించిన ధీరవనిత ఝల్కారీబాయి అని కొనియాడారు. సిపాయిల తిరుగుబాటులో ముఖ్యపాత్ర పోషించి ఝాన్సీ ప్రాంతాన్ని రక్షిందన్నారు. ఆమె స్ఫూర్తితో మనమంతా దేశసమైక్యతకు పునరంకింత కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తగవుల వెంకటస్వామి, కవి పండితుడు గిరిరాజాచారి, యూటీఎఫ్​ జిల్లా […]

Read More

రోడ్డు పనుల్లో నాణ్యత ఏది?

సారథి న్యూస్​, వనపర్తి: వనపర్తి జిల్లా కొత్తకోట రోడ్డు విస్తరణ పనుల్లో నాణ్యత లోపించిందని, కలెక్టర్ వెంటనే స్పందించి నాణ్యతతో పనులు జరిగేలా చూడాలని బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాచాల యుగంధర్ గౌడ్ డిమాండ్​ చేశారు. గురువారం ఆయన పనులను పరిశీలించారు. పట్టణంలో రూ.నాలుగున్నర కోట్ల వ్యయంతో చేపట్టిన రోడ్డు విస్తరణ పనుల్లో నాణ్యత కొరవడిందని ఆరోపించారు. ఇప్పటికైనా పర్యవేక్షణ పెంచాలని అధికారులను కోరారు. ఆయన వెంట బీసీ సంక్షేమ సంఘం […]

Read More

అరక పట్టి.. సాలు కొట్టి

సారథి న్యూస్​, నారాయణపేట: మంత్రి వి.శ్రీనివాస్​గౌడ్​ రైతన్నలా మారారు. అరక పట్టి పొలం దున్నారు. కొద్దిసేపు రైతులతో మాట్లాడి వారి కష్టసుఖాలు తెలుసుకున్నారు. నారాయణపేట జిల్లా మద్దూర్ మండలం నిడ్జింత జడ్పీ హైస్కూలులో నూతనంగా నిర్మించిన అదనపు గదులను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి గురువారం ప్రారంభించారు. తిరుగు ప్రయాణంలో పొలంలో విత్తనాలు వేస్తున్న రైతులను కలిసి వారి బాగోగులు తెలుసుకున్నారు. విత్తనాలు అందుతున్నాయా.. లేదా.. అని అడిగి ఆరా తీశారు. మంత్రి తమతో […]

Read More

పక్కా ప్రణాళికతో విత్తనాల సరఫరా

సారథి న్యూస్​, హైదరాబాద్: విత్తనాల కొరత, ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని మంత్రి సింగిరెడ్డి నిరంజన్​రెడ్డి అధికారులను ఆదేశించారు. వానాకాలంలో విత్తనాల సరఫరాపై గురువారం రెడ్ హిల్స్ ఉద్యానశిక్షణ కేంద్రంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులకు అవసరమైన విత్తనాలు అందుబాటులో ఉన్నాయని, క్లస్టర్ల వారీగా ఏయే విత్తనాలు కావాలో నమోదు చేయాలని అధికారులకు సూచించారు. ప్రధాన విత్తన కంపెనీల్లో ప్రతిరోజు సమాచారం సేకరించాలని ఆదేశించారు. సమావేశంలో వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి బి.జనార్ధన్ రెడ్డి, విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ […]

Read More

కరోనా పోలే.. జాగ్రత్తగా ఉండాలె

సారథి న్యూస్​, గోదావరిఖని: కరోనా వైరస్​ వ్యాప్తి చెందకుండా జాగ్రత్తగా ఉండాలని, ప్రజలకు అవగాహన కల్పించాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్​ సిక్తాపట్నాయక్ సంబంధిత అధికారులను ఆదేశించారు. కోవిడ్​–19 నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై గురువారం స్థానిక కలెక్టరేట్​లో అధికారులతో సమీక్షించారు. ప్రభుత్వం లాక్ డౌన్ ఆంక్షలను సడలించిన నేపథ్యంలో ప్రజలు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్తున్నారని, దేశవ్యాప్తంగా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జిల్లాలో రాత్రిపూట కర్ఫ్యూను కట్టుదిట్టంగా అమలు చేయాలన్నారు. వృద్ధులు, […]

Read More

నకిలీ సీడ్స్​ విక్రయిస్తే కటకటాలే

సారథి న్యూస్​, గోదావరిఖని: రైతులకు నకిలీ సీడ్స్​ విక్రయించే వారిపై చర్యలు తప్పవని, అటువంటి వ్యాపారులపై పీడీ యాక్ట్​ నమోదు చేస్తామని డీజీపీ మహేందర్​రెడ్డి హెచ్చరించారు. తెలంగాణలో వాటిని అమ్మాలంటేనే భయపడేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. గురువారం హైదరాబాద్​ నుంచి డీజీపీ మహేందర్​ రెడ్డి అన్ని ఎస్పీలు, పోలీస్ కమిషనర్లు, పోలీస్ అధికారులతో వీడియోకాన్ఫరెన్స్​లో మాట్లాడారు. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు.. లాక్ ​డౌన్​ సమయంలో పోలీసులు తీసుకుంటున్న చర్యలను అభినందించారు. అన్ని పోలీస్ స్టేషన్లలో థర్మల్ స్క్రీనింగ్ […]

Read More