సారథిన్యూస్, హైదరాబాద్: ప్రముఖ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే మీడియాకు చెప్పారు. బండ్ల గణేశ్‌కు కరోనా సోకినట్టు గత రెండు, మూడు రోజులుగా సామాజిక మాధ్యమాల్లో వార్తలు గుప్పుమన్నాయి. దీంతో మీడియా ప్రతినిధులు శనివారం ఆయనను సంప్రదించగా తనకు కరోనా సోకినట్టు ధ్రువీకరించారు. ప్రస్తుతం హోం క్వారైంటైన్ లో ఉన్నానని ఆయన చెప్పారు. త్వరలో అపోలో లేదా కాంటినెంటల్ హాస్పిటల్లో చేరనున్నట్టు తెలిపారు. ఇటీవల బండ్ల గణేశ్ హెయిర్ ప్లాంటేషన్ నిమిత్తం ఓ దవాఖానకు వెళ్లగా, అనారోగ్య లక్షణాలను చూసిన అక్కడి డాక్టర్ కరోనా టెస్ట్ కు రిఫర్ చేశారట. ఆ వెంటనే బండ్ల గణేశ్ కరోనా పరీక్షలు చేయించుకోగా, పాజిటివ్ గా తేలింది. బండ్ల గణేశ్‌కు కరోనా రావడంతో తెలుగు చిత్రపరిశ్రమ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇటీవల ఆయనను కలిసినవారంతా హోం క్వారైంటైన్‌కు వెళ్లారు.
- June 20, 2020
- Archive
- Top News
- BANDLA GANESH
- CARONA
- HYDERABAD
- TOLLYWOOD
- హెయిర్ ప్లాంటేషన్
- హోం క్వారైంటైన్
- Comments Off on బండ్ల గణేశ్‌కు కరోనా