Breaking News

దివ్యాచౌక్సీ కన్నుమూత

దివ్యాచౌక్సీ కన్నుమూత

మిస్ యూనివర్స్ కంటెస్టెంట్, ప్రముఖ టీవీనటి దివ్యాచౌక్సీ కొద్దికాలంగా కేన్సర్ తో పోరాడుతూ ఆదివారం కన్నుమూసింది. చనిపోవడానికి కొన్ని గంటల ముందు దివ్యా చౌక్సీ తన చివరి పోస్టును ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. అదిప్పుడు అందరినీ కంటతడి పెట్టిస్తోంది. కేన్సర్ తో పోరాడుతాను తాను గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాకు దూరంగా ఉన్నానని..‘ప్రస్తుతం నేను నా డెత్ బెడ్ మీద ఉన్నా.. ఏం చెప్పాలో కూడా నాకు తెలీడం లేదు.. నాకు ఏమైనా జరగొచ్చు.. అయినా నేను ధైర్యంగానే ఉన్నాను.. మరో జన్మ ఉంటే ఇలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలని కోరుకుంటున్నా.. నన్ను ఏం ప్రశ్నించకండి ప్లీజ్.. బై’ అని వేడుకోలుతో చివరిసారిగా ఆమె చేసిన ట్వీట్ అందరినీ ఎమోషన్​కు గురిచేసింది. ఆమెతో కలిసి నటించిన సహా నటులంతా దివ్యా ఆత్మకు శాంతి చేకూరాలని సంతాపం తెలుపుతున్నారు.