Breaking News

కొండపోచమ్మ నిర్వాసితులకు పరిహారం

సారథి న్యూస్, రామాయంపేట: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన కొండపోచమ్మ సాగర్​​లో భూములు కోల్పోయిన నిర్వాసితులకు అధికారులు పరిహారం చెక్కులను పంపిణీ చేశారు. మెదక్​ జిల్లా రామాయంపేట మండలంలోని నార్లాపూర్​ గ్రామంలో 178 మంది కొండపోచమ్మ రిజర్వాయర్​లో భూములు కోల్పోయారు. వీరికి ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్ రెడ్డి, మెదక్ ఆర్డీవో సాయిరాం చెక్కులను పంపిణీ చేశారు. ఎండాకాలంలో కూడా చెరువులన్నీ నిండాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిందని ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్​ జైరాం, ఎంపీపీ దేశెట్టి సిద్ధిరాములు, జెడ్పీటీసీ పంజా విజయ్ కుమార్, కో అప్షన్ సభ్యులు గౌస్, స్థానిక సర్పంచు మండల ఫోరం అధ్యక్షులు అమర్ సేనారెడ్డి, ఎంపీటీసీ రాజిరెడ్డి, మండల టీఆర్​ఎస్​ నాయకులు సుధాకర్ రెడ్డి, దయాకర్, సంతోష్ గౌడ్, నగేశ్​, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.