సారథి న్యూస్, వరంగల్: హన్మకొండ సీఎస్ఆర్ గార్డెన్స్ లో సోమవారం వరంగల్ పోలీస్ కమిషనర్ డాక్టర్ రవీందర్ పదవీ విరమణ సందర్భంగా ఆత్మీయ సన్మాన కార్యక్రమం ఏర్పాటుచేశారు. ముఖ్యఅతిథిగా హాజరైన రాజ్యసభ సభ్యుడు బండా ప్రకాశ్ మాట్లాడుతూ.. పోలీస్ కమిషనర్‌గా డాక్టర్ రవీందర్ వరంగల్ నగరానికి చేసిన సేవలు అభినందనీయమన్నారు. ప్రస్తుతం కరోనా విపత్కర సమయంలో అందరికీ అందుబాటులో ఉండి ప్రజలకు సేవలు అందించారని కొనియాడారు. అనంతరం సీపీ డాక్టర్ రవీందర్ మాట్లాడుతూ..వరంగల్‌లో పనిచేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. అందరూ ఎంతో సహకరించారని అన్నారు. కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, మేయర్ గుండా ప్రకాష్ రావు, వరంగల్ జడ్పీచైర్మన్ సుధీర్‌బాబు, కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి, ఎమ్మెల్యేలు సన్నపనేని నరేందర్, ఆరూరి రమేష్, చల్లా ధర్మారెడ్డి, డాక్టర్ తాటికొండ రాజయ్య తదితరులు పాల్గొన్నారు.
- June 29, 2020
- Archive
- లోకల్ న్యూస్
- హైదరాబాద్
- CP RAVINDAR
- WARANGAL
- వరంగల్
- సీపీ రవీందర్
- Comments Off on వరంగల్ సీపీకి ఆత్మీయ సన్మానం