
ముంబై: పరిమిత ఓవర్ల క్రికెట్లో కేఎల్ రాహుల్ నిలకడగా ఆడుతున్నా.. టెస్ట్ మ్యాచ్‌ల్లో మాత్రం ఐదో స్థానం అజింక్యా రహానేదేనని మాజీ ఆటడాడు సంజయ్ మంజ్రేకర్ వ్యాఖ్యానించాడు. కెరీర్ ఆరంభంలో రహానే కాస్త వెనబడినా.. ఇప్పుడు మాత్రం టీమిండియాను గెలిపించే సత్తా ఉందన్నాడు. ‘రహానే స్థానాన్ని భర్తీ చేయాలంటే ముందుగా రాహుల్ దేశవాళీ ఫస్ట్ క్లాస్ క్రికెట్లో టన్నులకొద్ది పరుగులు చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఆడుతున్న ఆట ఎంతమాత్రం ప్రామాణికం కాదు. టెస్ట్‌లో రహానే ఆలస్యంగా ఫామ్‌లోకి వచ్చినా.. ఇప్పుడు మాత్రం అద్భుతంగా ఆడుతున్నాడు. కాబట్టి ఐదో స్థానం రహనేదే’ అని మంజ్రేకర్ పేర్కొన్నాడు. రాహుల్ ఆడిన తన చివరి టెస్ట్ ( వెస్టిండీస్)లో పెద్దగా ఆకట్టుకోలేకపోయాడన్నాడు. టీ20, వన్డే ఫార్మాట్ లో చేసినంత సులువుగా టెస్ట్ మ్యాచ్‌లో పరుగులు చేయలేకపోతున్నాడని చెప్పాడు. టెస్ట్ మ్యాచ్‌లో మిడిలార్డర్ బ్యాట్సమెన్గా రాహుల్ రాణించాలంటే దేశవాలీ మ్యాచ్‌లో భారీగా పరుగులు చేయాలన్నారు. టీమిండియాలోకి రావడానికి మయాంక్ అగర్వాల్ ఎలాగైతే అడాడో అలా ఆడాలి’ అని ఈ ముంబైకర్ పేర్కొన్నాడు. ఆస్ట్రేలియా టూర్లో రోహిత్, మయాంక్ ను ఓపెనర్లుగా దించాలన్నాడు. పృథ్వీ షాను రిజర్వ్ ఓపెనర్‌గా ఎంపిక చేయాలని సూచించాడు. ద్వంద్వ కెప్టెన్సీ ఇప్పుడు భారత్‌కు పనికి రాదన్న సంజయ్.. మూడు ఫార్మాట్లలో కోహ్లీనే సారథిగా కొనసాగించాలన్నారు.