Breaking News

మేమున్నామని..

మేమున్నామని..

సారథి న్యూస్, కర్నూలు: జిల్లా పోలీసు శాఖలోని ఆర్మ్​డ్ రిజర్వుడు హెడ్ క్వార్టర్ లో పనిచేస్తున్న ఏఆర్ మహిళా కానిస్టేబుల్ వి.మహాదేవి గత ఆగష్టు 11న రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. ఆమె కుటుంబాన్ని ఆదుకునేందుకు 2018 బ్యాచ్ కు చెందిన ఎఆర్ మహిళా కానిస్టేబుళ్లు తమ వంతు సహాయంగా సేకరించిన మొత్తం రూ.2.26లక్షల నగదును గురువారం జిల్లా పోలీసు ఆఫీసులో మహిళా కానిస్టేబుల్ కుటుంబానికి అందజేశారు. కార్యక్రమంలో ఎస్ఈబీ అడిషనల్ ఎస్పీ గౌతమిసాలి, ట్రైనీ ఐపీఎస్​ కొమ్మి ప్రతాప్, శివకిషోర్, ఏఆర్ అడిషనల్ ఎస్పీ రాధాకృష్ణ, ఏఆర్ డీఎస్పీ ఇలియాజ్ భాషా, ట్రైనీ డీఎస్పీ భవ్యకిషోర్, తోటి బ్యాచ్ మహిళా పోలీసులు పాల్గొన్నారు.