
సారథిన్యూస్, హైదరాబాద్: రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ కార్యాలయంలో కరోనా కేసులు రావడం ఆందోళన కలిగిస్తున్నది. ఈటలకు చెందిన 7 గురు వ్యక్తిగత సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ నేపథ్యంలో మంత్రి ఈటల కూడా కరోనా పరీక్షలు చేయించుకున్నట్టు సమాచారం. మంత్రికి చెందిన ఇద్దరు డ్రైవర్లు, ఇద్దరు పీఏలు, ముగ్గురు గన్మెన్లకు ప్రస్తుతం కరోనా సోకింది. వారంతా హోమ్ ఐసోలేషన్‌లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. దీంతో వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ప్రస్తుతం ఆఫీసుకు వెళ్లడం లేదని ఇంట్లో నుంచే పనిచేస్తున్నట్టు సమాచారం.