లండన్: వ్యాఖ్యాతగా.. బీబీసీతో ఉన్న అనుబంధాన్ని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జెఫ్రీ బాయ్‌కాట్ తెంచుకున్నాడు. 14 ఏళ్లుగా కొనసాగిస్తున్న సేవల నుంచి విరమించుకున్నాడు. ‘బీబీసీకి ప్రత్యేకమైన వ్యాఖ్యాతల బృందం ఉంటుంది. అందులో నుంచి నేను వైదొలుగుతున్నా. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో నేను ఈ బాధ్యతల్లో కొనసాగలేను. నా ఆరోగ్యం గురించి కూడా ఆలోచించుకోచాలి. కరోనా కారణంగానే నేను ఈ నిర్ణయం తీసుకుంటున్నా. మొన్న గుండెకు శస్త్రచికిత్స కూడా చేయించుకున్నా. కాబట్టి ఒత్తిడితో కూడిన పనులు చేయొద్దనుకుంటున్నా’ అని 79 ఏళ్ల బాయ్‌కాట్ వెల్లడించాడు.
- June 7, 2020
- క్రీడలు
- BBC
- BOYCOTT
- గుండె శస్త్రచికిత్స
- బీబీసీ
- Comments Off on బీబీసీకి బాయ్‌కాట్ గుడ్ బై