సారథి న్యూస్, మహబూబాబాద్: పల్లె ప్రగతి వనాలపై అవగాహన కల్పించాలని మహబూబాబాద్ కలెక్టర్ వీపీ గౌతమ్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన మహబూబాబాద్ రూరల్ మండలం వేమునూరు, శీతల్ గ్రామాల్లో పర్యటించారు. ప్రభుత్వ భూములను పరిశీలించడంతో పాటు శ్మశానవాటిక పనులను పరిశీలించారు. అవెన్యూ ప్లాంటేషన్ కు నాటే మొక్కలు పెద్దవిగా ఉండాలని కలెక్టర్ సూచించారు. మొక్కల సంరక్షణకు గ్రామంలో ట్రీ గార్డులను ఏర్పాటు చేయాలని ఊరు వెలుపల నాటే మొక్కలకు సర్కారు తుమ్మ కంపను రక్షణగా ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు. కురవి రోడ్డులో నిర్మితమవుతున్న కొత్త కలెక్టరేట్ కాంప్లెక్స్ నిర్మాణ పనులను కలెక్టర్ సందర్శించి పర్యవేక్షించారు. వివిధ ప్రభుత్వ శాఖలకు నిర్మిస్తున్న ఈ కలెక్టరేట్ భవనం నిర్మాణ పనులు వేగంగా కొనసాగించాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ విద్యాచందన ఎంపీడీవో రవీందర్ రెడ్డి, తహసీల్దార్ రంజిత్ కుమార్ ఉన్నారు.
- June 29, 2020
- Archive
- షార్ట్ న్యూస్
- MAHABUBABAD
- PALLEPRAGATHI
- పల్లెప్రగతి వనాలు
- మహబూబాబాద్
- Comments Off on పల్లె ప్రగతి వనాలపై అవగాహన కల్పించండి