
సారథి న్యూస్, అమరావతి: అనారోగ్యంతో ప్రాణాలు కోల్పోయిన దుర్గాప్రసాద్‌కు పేదల నేతగా ప్రజల్లో పేరుంది. నిత్యం ప్రజలతో కలిసిమెలిసి ఉంటే దుర్గాప్రసాద్ నిరాడంబరంగా మెలిగేవారు. తన అనుచరులను నిత్యం పేరుపెట్టి పిలుస్తూ పలకరించేవారు. ఏ కష్టమొచ్చినా వెంబడే స్పందించారు. అలాంటి నేత తమ మధ్య లేకపోవడంతో కార్యకర్తలు నిర్ఘాంతపోయారు.
ఇదీ రాజకీయ చరిత్ర..
టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ పిలుపుతో 26 ఏళ్ల వయస్సులోనే దుర్గాప్రసాద్ రాజకీయాల్లోకి వచ్చారు. అంతకు ముందు ఆయనకు నెల్లూరు మంచి లాయర్‌గా పేరు ఉండేది. అయితే తొలిసారిగా నెల్లూరు జిలా గూడురు ఎమ్మెల్యే గెలుపొంది.. అదే నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 1985, 1994, 1999, 2004,2009 మధ్య కాలంలో ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2019 ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ నుంచి గెలుపొందారు. 1996-98 వరకు ఆయన చంద్రబాబు హయాంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. అయితే 2019 లో జగన్ సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరి తిరుపతి నుంచి ఎంపీగా గెలుపొందారు. ఆయన నిరంతరం తిరుపతి అభివృద్ధి గురించే తపించేవారు.
సీఎం జగన్, చంద్రబాబు సంతాపం
దుర్గాప్రసాద్ మృతికి ఏపీ ముఖ్యమంత్రి జగన్, మాజీ సీఎం చంద్రబాబునాయుడు సంతాపం తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గొప్పనేతను కోల్పోయిందని సీఎం జగన్ వ్యాఖ్యానించారు. దుర్గాప్రసాద్ కుటుంబసభ్యులకు ఆయన ఫోన్‌చేసి ఓదార్చారు.