
సారథిన్యూస్, రామడుగు: అంబేద్కర్ ఇంటిపై దాడిచేయడమంటే దళితుల ఆత్మగౌరవంపై దాడిచేసినట్టేనని టీపీసీసీ ఎస్సీ సెల్ రాష్ట్ర కన్వీనర్ వెన్న రాజమల్లయ్య పేర్కొన్నారు. అంబేద్కర్ నివాసం రాజగృహపై దాడిని కాంగ్రెస్ తీవ్రంగా ఖండిస్తున్నదని చెప్పారు. ఈ ఘటనపై ముంబై పోలీసులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంబేద్కర్ ఇంటిని ధ్వంసం చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బొంకూరు మధు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సతీష్ డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు గోదావరిఖనిలో మీడియాతో మాట్లాడారు.