
అమరావతి: వరుస ఎదురుదెబ్బలతో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. చంద్రబాబు, యువనేత లోకేశ్ మీద నమ్మకం లేక పలువురు కీలకనేతలు ఆ పార్టీని వీడుతున్నారు. మరికొందరు పార్టీలోనే ఉన్నా అధికారిక కార్యక్రమాలకు హాజరుకావడం లేదు. ఈ క్రమంలో టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. శుక్రవారం తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో సీఎం జగన్మోహన్రెడ్డి రమేష్‌బాబుకు స్వయంగా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రి అవంతి శ్రీనివాస్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. యలమంచిలి, పెందుర్తి నుంచి రమేష్‌బాబు గతంలో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కాగా, అభివృద్ధి వికేంద్రీకరణపై టీడీపీ వైఖరితో విసిగిపోయిన పంచకర్ల మే నెలలోనే పార్టీకి గుడ్ బై చెప్పారు. ఎగ్జిక్యూటివ్ రాజధానిగా విశాఖను అడ్డుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.