సారథి న్యూస్, నారాయణఖేడ్: రాష్ట్ర ప్రభుత్వం ప్రశ్నించే గొంతులను నొక్కుతున్నదని సంగారెడ్డి జిల్లా ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు బోర్గి సంజీవ్ ఆరోపించారు. జర్నలిస్ట్ తీన్మార్ మల్లన్నపై దాడిని ఆప్ తీవ్రంగా ఖండిస్తుందని చెప్పారు. పక్కాప్లాన్ ప్రకారమే ఆయనపై ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అనుచరులు దాడికి పాల్పడ్డారని చెప్పారు. సీఎం కేసీఆర్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ జర్నలిస్టులను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ఆమ్ఆద్మీపార్టీ జర్నలిస్టులకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
- July 15, 2020
- Archive
- నిజామాబాద్
- లోకల్ న్యూస్
- షార్ట్ న్యూస్
- AAP
- ATTACK
- MALLANNA
- SANGAREDDY
- ఎమ్మెల్యే
- నారాయణఖేడ్
- Comments Off on జర్నలిస్టులపై దాడులు సరికాదు