![](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/06/beijing-2-1.jpg?fit=1463%2C675&ssl=1)
బీజింగ్: చైనాలో కరోనా మరోసారి వ్యాప్తి చెందుతోంది. 24 గంటల్లో 18 కేసులు నమోదయ్యాయి. వాటిలో ఆరు కేసులు బీజింగ్‌లో నమోదయ్యాయి. అన్ని కేసులు జిన్ఫాడీ మీట్ మార్కెట్లో ఈ కేసులు నమోదయ్యాయి. బీజింగ్‌లో ఇదే అతిపెద్ద హోల్‌సేల్ మార్కెట్ కావడంతో అధికారులు బీజింగ్‌లోని చాలా చోట్ల లాక్డౌన్ విధించారు. ఈ మార్కెట్లో మొత్తం ఏడు కేసుల నమోదు కాగా.. శనివారం ఒక్కరోజే ఆరు కేసులు నమోదయ్యాయి. సీఫుడ్ ప్రాడెక్ట్స్, మీట్ ప్రోడక్ట్స్‌పై పర్యవేక్షణ మొదలు పెట్టామని అధికారులు చెప్పారు. బీజింగ్‌లోని అన్ని సూపర్ మార్కెట్లలో ఉన్న సాల్మన్ చేపలను తొలగించారు. వాటిని అమ్మొద్దని నిషేధం విధించారు.