!['గాంధీ'లో కేంద్ర బృందం](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/04/WhatsApp-Image-2020-04-27-at-11.03.47-PM.jpeg?fit=1280%2C853&ssl=1)
సారథి న్యూస్, హైదరాబాద్ : కేంద్ర అంతర్ మంత్రిత్వ శాఖల అధికారుల బృందం సోమవారం సాయంత్రం గాంధీ హాస్పిటల్‌ను సందర్శించింది. ఈ సందర్భంగా ప్రిన్సిపల్, ఇతర విభాగాల వైద్యాధికారులతో సమావేశమైంది. పాజిటివ్ కేసులకు అందిస్తున్న వైద్యసేవలు, వసతులు అందుబాటులోని శానిటేషన్స్, పారామెడికల్, సిబ్బంది, సెక్యూరిటీ, వార్డు బాయ్స్ పనితీరు, పీపీఈలు మెడిసిన్స్ లభ్యత వివరాలు తెలుసుకున్నారు.
గాంధీ హాస్పిటల్ లోని బెడ్స్, ఐసీయూలో బెడ్స్, వెంటిలేటర్లు తదితర అంశాలను వాకబు చేశారు. వైద్యులు, ఇతర సిబ్బంది తీసుకుంటున్న జాగ్రత్తలను తెలుసుకున్నారు. చికిత్స పొందుతున్న వారిలో 90 శాతం మంది ఆరోగ్య పరిస్థితి నార్మల్ గానే ఉందని వివరించారు.
అనంతరం గాంధీ హాస్పిటల్లో ఏర్పాటుచేసిన కోవిడ్-19 ప్రత్యేక వార్డును పరిశీలించారు. వైద్యులు, సిబ్బంది అందిస్తున్న సేవలను ప్రశంసించారు. ఇక్కడ అందిస్తున్న సేవలు ఇతర ప్రాంతాలకు ఆదర్శంగా నిలుస్తాయని అభిప్రాయపడ్డారు.