సారథి న్యూస్, నల్లగొండ: కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తుల పట్ల వివక్ష చూపకూడదని, వారిని చూసి హేళనగా మాట్లాడకూడదని, చుట్టుపక్కల వ్యక్తులను ఇబ్బందులకు గురిచేయొద్దని నల్లగొండ జిల్లా ఎస్పీ రంగనాధ్ సూచించారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కరోనా పాజిటివ్ వచ్చిన వారిని ఇంటి యజమానులు వేధిస్తున్నట్లు, ఇల్లు ఖాళీ చేయమని ఇబ్బందులు గురి చేస్తున్నట్లుగా తమ దృష్టికి వచ్చిందన్నారు. సరైన జాగ్రత్తలు, ఆరోగ్య రక్షణ చర్యలు చేపట్టడం ద్వారా రోగ నిరోధకశక్తి పెంచుకునే ఆహారాన్ని తీసుకోవడం ద్వారా పాజిటివ్ వచ్చిన చాలా మంది కోలుకున్నారని ఆయన గుర్తు చేశారు. కష్టకాలంలో మనుషులు ఒకరికి ఒకరు అండగా నిలిస్తూ సమైక్యంగా కరోనాపై పోరాడాలని ఆయన జిల్లా ప్రజలను ఎస్పీ కోరారు.
- June 29, 2020
- Archive
- నల్లగొండ
- CARONA
- NALGONDA
- SP RANGANATH
- ఎస్పీ రంగనాధ్
- కరోనా
- నల్లగొండ
- Comments Off on కరోనా రోగులపై వివక్ష వద్దు