Breaking News

కరోనాతో 9 మంది మృతి

కరోనాతో 9 మంది మృతి

సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో గురువారం 1,567 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటిదాకా 50,826కు పాజిటివ్​కేసులు నిర్ధారణ అయ్యాయి. తాజాగా 1,661 మంది రికవరీ అయ్యాయి. మహమ్మారి బారినపడి ఒకేరోజు 9 మంది కరోనా మృత్యువాతపడ్డారు. ఇప్పటిదాకా 438 మంది మృతిచెందారు. జిల్లాల వారీగా పరిశీలిస్తే.. జీహెచ్ఎంసీ 662 కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి 213, మేడ్చల్​33, సంగారెడ్డి 32, ఖమ్మం 10, కామారెడ్డి 17, వరంగల్ ​అర్బన్​75, వరంగల్ ​రూరల్​ 22, కరీంనగర్ 38, జగిత్యాల 14, మహబూబాబాద్​18, మెదక్​27, మహబూబ్​నగర్​61, భూపాలపల్లి 25, నల్లగొండ 44, సిరిసిల్ల 62, ఆదిలాబాద్​17, నాగర్​కర్నూల్​51, జనగాం 22, నిజామాబాద్​38, ములుగు 17, సూర్యాపేట 39 చొప్పున కేసులు నిర్ధారణ అయ్యాయి. ఈ మేరకు హెల్త్​తెలంగాణ వైద్యారోగ్యశాఖ బులెటిన్​ను విడుదల చేసింది.